Back to Home
Watermark
శుక్రవారం, 04 సెప్టెంబర్, 2026 TIME : 02:30 PM

వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి పరుగులు

Main Image

వెయ్యి రోజుల పాలనలో అభివృద్ధి పరుగులు

అనంతపల్లిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు – ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట

బోయినిపల్లి తెలంగాణ అడ్డా ప్రతినిధి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో బోయినిపల్లి మండలంలోని అనంతపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

గత పదేళ్ల పాలనలో అనంతపల్లి గ్రామానికి జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా పరిపాలనలో గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులకు ప్రాధాన్యత లభిస్తోందని అన్నారు.

Additional Image

“మా గ్రామ అభివృద్ధిని కళ్లారా చూస్తున్నాం.. సత్యం అన్నగారి ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో చొప్పదండి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం పెరుగుతుంది” అని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేశాయి.

రాబోయే ఎన్నికల్లో చొప్పదండి నియోజకవర్గం నుంచి డాక్టర్ మేడిపల్లి సత్యం భారీ మెజార్టీతో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారని కాంగ్రెస్ నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనకు మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అదేవిధంగా రాష్ట్రంలో మరోసారి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, దేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నారు.

“ముగ్గురు యువ నాయకులు.. రేవంత్‌రెడ్డి, డాక్టర్ మేడిపల్లి సత్యం, రాహుల్‌గాంధీ.. ప్రజల కోసం ముందుకు సాగుతున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలమైన విజయాలను నమోదు చేయడం ఖాయం” అని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.

Clip Adjustments