Back to Home
Watermark
శుక్రవారం, 04 సెప్టెంబర్, 2026 TIME : 03:20 PM

సారంగాపూర్ లో టిఆర్ఎస్ భారీ నిరసన

Main Image

సారంగాపూర్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన ర్యాలీ

పెంబట్లలో వంటా-వార్పు.. కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై ఆగ్రహం

జగిత్యాల ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఆరు గ్యారంటీలు, 420 హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

పెంబట్ల గ్రామ శివారు నుంచి రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భారీగా ర్యాలీ చేపట్టారు. చేతుల్లో బీఆర్ఎస్ జెండాలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘జై తెలంగాణ.. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి’ అంటూ నినదిస్తూ ర్యాలీ కొనసాగించారు.

అనంతరం రోడ్డుపై బైఠాయించి వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం, కేసీఆర్ కిట్, విద్యార్థులకు స్కూటీలు వంటి హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి దావా వసంత సురేష్తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఈ నిరసన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. రోడ్డుపై వంటలు చేస్తూ ప్రభుత్వ తీరుపై తమ నిరసనను వ్యక్తం చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

Clip Adjustments