Back to Home
Watermark
శుక్రవారం, 04 సెప్టెంబర్, 2026 TIME : 05:19 PM

బొల్లారం పబ్లిక్ స్కూల్లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

Main Image

బొల్లారం పబ్లిక్ స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

ముఖ్యఅతిథిగా పాల్గొన్న యువజన నాయకుడు వి. ప్రవీణ్‌రెడ్డి

జిన్నారం మండలం, బొల్లారం, తెలంగాణ అడ్డా ప్రతినిధి:

బొల్లారం పబ్లిక్ స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలను పాఠశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి డివిజన్ యువజన నాయకుడు వి. ప్రవీణ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధాదేవి తదితరుల వేషధారణలో ఆకట్టుకున్నారు. చిన్నారుల ప్రత్యేక వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అలరించాయి.

ముఖ్యఅతిథి వి. ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను అందంగా ప్రత్యేక వేషధారణలో తీర్చిదిద్దడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ప్రత్యేక వేషధారణలో ఆకట్టుకున్న చిన్నారులకు ఈ సందర్భంగా బహుమతులను అందజేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ప్రభు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments