Back to Home
Watermark
శుక్రవారం, 04 సెప్టెంబర్, 2026 TIME : 06:03 PM

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ 1000 రోజుల పాలన సందర్భంగా ఘనంగా విజయోత్సవ బైక్ ర్యాలీ

Main Image

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ 1000 రోజుల పాలన సందర్భంగా ఘనంగా విజయోత్సవ బైక్ ర్యాలీ

సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్న ‘అల్ఫోర్స్’ డా. వి. నరేందర్ రెడ్డి

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వీఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ‘అల్ఫోర్స్’ డా. వి. నరేందర్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పరిపాలనలో పట్టు సాధిస్తూ, మంత్రులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకోవడం సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయని అన్నారు.

కరీంనగర్‌లోని ఇందిరా చౌక్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ రాజీవ్ గాంధీ చౌక్, మహాత్మా గాంధీ చౌక్, బాబు జగ్జీవన్ రామ్ చౌక్ మీదుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విజయాలను వివరిస్తూ నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ సత్తు మల్లేశం, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు, కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఆకుల నర్సయ్య, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజన్ కుమార్, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పురుమల్ల శ్రీనివాస్, కరీంనగర్ కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు కర్ర రాజశేఖర్, మడుపు మోహన్ చారీ, ఆకారపు భాస్కర్ రెడ్డి, సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రజిత రెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు శ్రావణ్ నాయక్, యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కిమ్ ఫహద్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments