Back to Home
Watermark
శుక్రవారం, 04 సెప్టెంబర్, 2026 TIME : 06:20 PM

శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి

Main Image

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల లో భాగంగా

ప్రత్యేక పూజలు నిర్వహించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

తెలంగాణ అడ్డా ప్రతినిధి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని హెచ్‌ఎంటీ చింతల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి హాజరై శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రజలందరినీ భక్తి, ధర్మం, సత్యం వైపు నడిపించే పవిత్రమైన పండుగ అని అన్నారు. శ్రీకృష్ణుడి బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో శాంతి, సౌభాగ్యం, సమృద్ధి వెల్లివిరియాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బత్తుల లక్ష్మణ్ యాదవ్, మధుకర్ యాదవ్, బాబురావు యాదవ్, కామేష్ యాదవ్, పూర్ణచందర్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments