Back to Home
Watermark
శుక్రవారం, 04 సెప్టెంబర్, 2026 TIME : 09:10 PM

పండగలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు

Main Image

ధర్మ పరిరక్షణకు ప్రతీక శ్రీకృష్ణుడు

పండుగలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయి: నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు

జిన్నారం ప్రతినిధి తెలంగాణ అడ్డా:

శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మ పరిరక్షణకు, సత్యానికి ప్రతీకగా నిలిచారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. పండుగలు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించడంతో పాటు ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు.

Additional Image

శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీతో పాటు పటాన్‌చెరు పట్టణంలో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు దేవరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాలు శ్రీకృష్ణ నామస్మరణలు, భజనలు, భక్తుల సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ.. భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన జీవన విలువలు నేటికీ ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రేమ, సేవాభావం, పరస్పర గౌరవం వంటి విలువలను పెంపొందించే పండుగలు సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో కౌన్సిలర్లు నారాయణదాసు, మన్నె రాఘవేంద్ర, సంపత్, సంగన్నగారి గోపాల్, సందీప్ గౌడ్, దస్తగిరి, నాయకులు రవి, శ్రీను, మెట్టు రాజు, భరత్, అత్తర్, సాయి, ఉత్సవ నిర్వాహకులు, భక్తులు, యువజన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments