Back to Home
Watermark
శుక్రవారం, 04 సెప్టెంబర్, 2026 TIME : 09:14 PM

కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా డ్రైవర్ మృతి

Main Image

కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి

హైదరాబాద్ నుంచి బిచ్కుందకు వెళ్తుండగా ఘోర ప్రమాదం

13 మంది ప్రయాణికులు.. పలువురికి గాయాలు

కామారెడ్డి ప్రతినిధి / తెలంగాణ అడ్డా

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి బిచ్కుందకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జుక్కల్ చౌరస్తా సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. అతివేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు జుక్కల్ చౌరస్తా సమీపంలో రక్షణ గోడను ఢీకొట్టి అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ప్రమాదంలో డ్రైవర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Clip Adjustments