Back to Home
Watermark
శనివారం, 05 సెప్టెంబర్, 2026 TIME : 08:22 PM

హైదరాబాద్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

Main Image

హైదరాబాద్‌లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

113 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం

హైదరాబాద్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

హైదరాబాద్ అబిడ్స్‌లోని స్టెయిన్లీ గర్ల్స్ హైస్కూల్లో హైదరాబాద్ జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యా రంగానికి విశిష్ట సేవలందించిన 113 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి, వారి సేవలను అభినందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య తదితర అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయులను అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించడంతో పాటు వారిని బాధ్యతాయుతమైన, విలువలతో కూడిన భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల సేవలు ఎనలేనివని కొనియాడారు.

విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే ఉపాధ్యాయుల సేవలను గుర్తించి వారిని సత్కరించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments