Back to Home
Watermark
శనివారం, 05 సెప్టెంబర్, 2026 TIME : 08:54 PM

ధర్మ పరిరక్షణతో పాటు వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహం

Main Image

ధర్మ పరిరక్షణతో పాటు వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహం

శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.. బీరంగూడలో డ్రై ఫ్రూట్స్ షాప్ ప్రారంభోత్సవంలో ఈర్ల రాజు ముదిరాజ్

పటాన్‌చెరు నియోజకవర్గం, అమీన్పూర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

ధర్మ పరిరక్షణతో పాటు స్థానికంగా వ్యాపార అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు ముదిరాజ్ అన్నారు.

పటాన్‌చెరు టౌన్‌లో మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ శ్రీకృష్ణ భగవానుడి బ్రహ్మోత్సవాల్లో ఈర్ల రాజు ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా భక్తులు, నాయకులు, మిత్రులతో కలిసి ధర్మం, ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణపై చర్చించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందాలంటే ప్రతి ఒక్కరూ వాటిని గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఈర్ల రాజు ముదిరాజ్ పేర్కొన్నారు. భక్తి, ధర్మంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావం, పరస్పర గౌరవాన్ని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో కిష్టయ్య యాదవ్, సన్నీ యాదవ్, రాజాచారి పంతులు తదితరులు పాల్గొన్నారు.

బీరంగూడలో డ్రై ఫ్రూట్స్ షాప్ ప్రారంభం

అనంతరం అమీన్పూర్ మండలం బీరంగూడ డివిజన్ పరిధిలోని గ్రీన్‌ఫీల్డ్ కాలనీలో రాజస్థానీ మార్వాడీ మిత్రులు నూతనంగా ఏర్పాటు చేసిన డ్రై ఫ్రూట్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈర్ల రాజు ముదిరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన దుకాణాన్ని ప్రారంభించి, వ్యాపార రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం అభివృద్ధి చెందడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన డ్రై ఫ్రూట్స్ అందిస్తూ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.

స్థానికంగా యువత, వ్యాపారులు కొత్త ఆలోచనలతో ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. వ్యాపార అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, స్థానిక ఆర్థిక ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ పరస్పరం సహకరించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నాయకులు మనోజ్ జి., విట్టల్ జి., పరమేశ్వర్, దీపక్, మనోహర్, రతన్, రాకేష్ తదితర రాజస్థానీ మార్వాడీ మిత్రులు పాల్గొన్నారు.

ధర్మాన్ని గౌరవిస్తూ.. సంస్కృతిని కాపాడుతూ.. వ్యాపారులకు అండగా నిలుస్తూ.. సమాజ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరితో కలిసి ముందుకు సాగడమే తన లక్ష్యమని ఈర్ల రాజు ముదిరాజ్ పేర్కొన్నారు.

Clip Adjustments