Back to Home
Watermark
శనివారం, 05 సెప్టెంబర్, 2026 TIME : 09:16 PM

కరీంనగర్‌లో అంబరాన్నంటిన 1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవాలు భారీ కేక్ కట్ చేసి.. బాణాసంచా కాల్చి సంబరాలు

Main Image

కరీంనగర్‌లో అంబరాన్నంటిన 1000 రోజుల ప్రజా పాలన విజయోత్సవాలు

భారీ కేక్ కట్ చేసి.. బాణాసంచా కాల్చి సంబరాలు

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాల్చడంతో పాటు డీజే సంగీతానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం 1000 రోజుల పాలనను పూర్తి చేసుకుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా, సంక్షేమాన్ని సంకల్పంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Clip Adjustments