Back to Home
Watermark
శనివారం, 05 సెప్టెంబర్, 2026 TIME : 09:52 PM

కేటీఆర్ గారూ.. సినిమా డైలాగులు కాదు, తెలంగాణ యువతకు ఉద్యోగాలు కావాలి బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నలు

Main Image

కేటీఆర్ గారూ.. సినిమా డైలాగులు కాదు, తెలంగాణ యువతకు ఉద్యోగాలు కావాలి

బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నలు

పెద్దపల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా

తెలంగాణ యువత భవిష్యత్తును రాజకీయాలకు బలి చేయకుండా విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కల్పనపై దృష్టి పెట్టాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ నాయకులు గత పదేళ్ల పాలనలో యువతకు ఇచ్చిన హామీలు, ఉద్యోగ నియామకాలు, పరీక్షా పత్రాల లీకేజీలపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ యువతకు కావాల్సింది రాజకీయ డైలాగులు కాదని, ఉద్యోగాలు, అవకాశాలు, భరోసాతో కూడిన భవిష్యత్తు అని వంశీకృష్ణ స్పష్టం చేశారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు సైతం జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో ప్రపంచస్థాయి విద్య, నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలను అందుకునేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడంతో పాటు వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, చివరకు ప్రజల తీర్పే అంతిమ తీర్పు అని ఎంపీ అన్నారు. తెలంగాణ యువత హక్కులు, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, భవిష్యత్తు కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని గడ్డం వంశీకృష్ణ పునరుద్ఘాటించారు.

Clip Adjustments