మంగంపేటలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ బాకీ కార్డుల పంపిణీ

మంగంపేటలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్ఎస్ బాకీ కార్డుల పంపిణీ
జిన్నారం మండల ప్రతినిధి / తెలంగాణ అడ్డా
జిన్నారం మండలంలోని మంగంపేట గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, అమలు చేసిన విధానాలను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికీ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిన్నారం మున్సిపాలిటీ చైర్మన్ జనార్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు జిన్నారం బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాయకోటి రాజేష్, మండల నాయకులు, మంగంపేట గ్రామ బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి బాకీ కార్డులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాచబోయిన మల్లేశం, రూపెరావు నరేందర్, మాజీ ఉపసర్పంచ్ నక్క నాగరాజు, పార్టీ సీనియర్ నాయకులు మాచబోయిన శ్రీశైలం, పంబల రతన్ కుమార్, కత్తుల నవీన్ కుమార్, నాయకోటి లక్ష్మణ్, మాచబోయిన శ్రీకాంత్, నక్క అఖిలేశ్, నక్క సందీప్, జిల్ల మల్లేశ్, కుమ్మరి నరేష్, ముస్తఫా రంజిత్ కుమార్, పంబల బాలకృష్ణతో పాటు గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం మాచబోయిన శ్రీశైలం ఏర్పాటు చేసిన తేనీటి విందులో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఇచ్చిన పిలుపును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు.