కరీంనగర్ జిల్లా తొలి తైక్వాండో చాంపియన్‌షిప్‌కు విశిష్ట అతిథిగా ‘అల్ఫోర్స్’ నరేందర్ రెడ్డి

కరీంనగర్ జిల్లా తొలి తైక్వాండో చాంపియన్‌షిప్‌కు విశిష్ట అతిథిగా ‘అల్ఫోర్స్’ నరేందర్ రెడ్డి
చదువుతో పాటు క్రీడలకూ ప్రాధాన్యం ఇవ్వాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి
కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా
క్రీడలు యువతలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంతో పాటు స్నేహబంధాలను బలోపేతం చేయడానికి గొప్ప వేదికగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి అన్నారు.
కరీంనగర్‌లోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన కరీంనగర్ జిల్లా ప్రథమ తైక్వాండో చాంపియన్‌షిప్ పోటీల ప్రారంభోత్సవానికి ఆయన విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించి, పోటీలను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లాలో క్రీడా రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సాహం, సహకారం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎం. గోపాల్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్ గౌడ్, వివిధ సంఘాల ప్రతినిధులు డాక్టర్ కృష్ణ చైతన్య, అరవింద్, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.