Back to Home
Watermark
ఆదివారం, 06 సెప్టెంబర్, 2026 TIME : 05:59 PM

యువ సమరభేరి విజేతతో బీజేపీ, కాంగ్రెస్‌లలో భయం మొదలైంది: బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్

Main Image

యువ సమరభేరి విజేతతో బీజేపీ, కాంగ్రెస్‌లలో భయం మొదలైంది: బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా

కరీంనగర్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన విద్యార్థి, యువ సమరభేరి సభ అపూర్వ విజయాన్ని సాధించడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో భయం మొదలైందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. సభ సక్సెస్ కాలేదంటూ మేయర్ కోలగాని శ్రీనివాస్ మాట్లాడటం బీజేపీ పార్టీ భయానికి నిదర్శనమని స్పష్టం చేశారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.

నగరపాలక సంస్థలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా కేంద్రం నుంచి ఒక్క రూపాయి నిధులు తీసుకురాకుండా, కేవలం జనరల్ ఫండ్స్‌తో ప్రారంభోత్సవాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఏళ్లు గడుస్తున్నా రైల్వే ఓవర్ బ్రిడ్జి పూర్తి చేయకపోవడమే బండి సంజయ్ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. మరోవైపు నగరంలో పారిశుధ్యం పడకేసిందని, మేయర్‌గా కోలగాని శ్రీనివాస్ పూర్తిగా విఫలమయ్యారని, అధికారులపై ఆయనకు నియంత్రణ లేదని విమర్శించారు. నగర సమస్యలపై సోమవారం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ప్రజావాణిలో వినతిపత్రం సమర్పిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు , షేక్ యూసుఫ్, మాజీ కార్పొరేటర్లు గందె మాధవి- మహేష్, నందేల్లి రమాదేవి, దిండిగాల మహేష్, కంసాల శ్రీనివాస్, ఎడ్ల అశోక్, బోనాల శ్రీకాంత్, నాంపల్లి శ్రీనివాస్, నక్క కృష్ణ, జక్కని ఉమాపతి, నాయకులు గడ్డం ప్రశాంత్ రెడ్డి, సుంకిశాల సంపత్ రావు, నేతి రవివర్మ, గంగాధర చందు, పటేల్ సుధీర్ రెడ్డి, నారదాసు వసంతరావు, అరే రవి, తొంటి రాజేందర్, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, నయీమ్, చేతి చంద్రశేఖర్, మంతిని కిరణ్, పిట్టల శ్రీనివాస్, మిడిదొడ్డి నవీన్, చొక్కారపు చంద్రం, మేచినేని పవన్, మహిళా నాయకురాళ్లు కంజర్ల రేణుక, గంటల రేణుక తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Clip Adjustments