Back to Home
Watermark
ఆదివారం, 06 సెప్టెంబర్, 2026 TIME : 06:01 PM

జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్ఐ సస్పెన్షన్

Main Image

జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్ఐ సస్పెన్షన్

డ్యూటీల కేటాయింపులో నిర్లక్ష్యం.. అవినీతి ఆరోపణలపై వేటు

జగిత్యాల ప్రతినిధి / తెలంగాణ అడ్డా

జగిత్యాల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్ఐ (RI) అడ్మిన్‌గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. విధుల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో పాటు సిబ్బంది నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు తెరపైకి రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా సిబ్బందికి డ్యూటీలు కేటాయించే విషయంలో కిరణ్ కుమార్ వ్యవహారశైలిపై పలు ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం. కొంతమంది సిబ్బందికి డ్యూటీలు కేటాయించకుండా, వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టిన అనంతరం కిరణ్ కుమార్‌పై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం ఆయనను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

అయితే సస్పెన్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, విచారణలో తేలిన అంశాలు అధికారికంగా వెల్లడైతేనే ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Clip Adjustments