అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం విజయరమణ రావుకు ప్రముఖుల శుభాకాంక్షలు

అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వ విప్ కార్యాలయం ప్రారంభం
విజయరమణ రావుకు ప్రముఖుల శుభాకాంక్షలు
పెద్దపల్లి ప్రతినిధి / తెలంగాణ అడ్డా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా నియమితులైన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావుకు రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వం అధికారిక కార్యాలయాన్ని కేటాయించింది. ఈ కార్యాలయాన్ని ఆదివారం వేద పండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు, మంత్రోచ్ఛారణల నడుమ విజయరమణ రావు ప్రారంభించారు.
కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రముఖులు ప్రభుత్వ విప్ విజయరమణ రావును శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ విప్‌గా బాధ్యతలు చేపట్టిన విజయరమణ రావు ప్రజా సమస్యల పరిష్కారంలో సమర్థవంతంగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు.
కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు విజయరమణ రావుకు శుభాకాంక్షలు తెలిపారు.