హరీష్ రావు అరెస్ట్అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. టీషర్ట్ విప్పి నిరసన తెలిపి, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావు అరెస్ట్

అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. టీషర్ట్ విప్పి నిరసన తెలిపి, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావు అరెస్ట్
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్ట్లు ధరించి ఆందోళన చేపట్టారు. అయితే, నినాదాలతో కూడిన టీషర్ట్లు ధరించి అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలోనే అసెంబ్లీ గేటు వద్ద తీవ్ర గందరగోళం చెలరేగింది. ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.. నిరసనగా తాను ధరించిన నల్ల టీషర్ట్‌ను అక్కడే విప్పివేశారు. కేవలం బనియన్‌తోనే అసెంబ్లీలోకి వెళ్లేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అడ్డుకోవడం అప్రజాస్వామ్యమని మండిపడ్డారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే హరీష్ రావును, ఇతర బీఆర్ఎస్ నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో అసెంబ్లీ ప్రాంతంలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.