ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన పోలీసులు

అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా సబితా ఇంద్రారెడ్డి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన పోలీసులు
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా
వర్షాకాల అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున హైదరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ సందర్భంగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలను అడ్డుకునే క్రమంలో పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించారు.
ప్రజా సమస్యలపై గళమెత్తి నిరసన తెలుపుతున్న మాజీ మంత్రి, సీనియర్ మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల పోలీసులు తీవ్ర దురుసుగా వ్యవహరించారు. కనీసం మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా ఆమెపై దాడికి దిగుతూ, జుట్టు పట్టుకొని దారుణంగా ఈడ్చుకెళ్లిన దృశ్యాలు తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల పోలీసు యంత్రంగం ఇంతటి దుర్మార్గంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్య వ్యవస్థే సిగ్గుపడేలా ఉందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇదేనా కాంగ్రెస్ సర్కార్ మహిళలకు ఇచ్చే గౌరవం అని, రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.