Back to Home
Watermark
సోమవారం, 07 సెప్టెంబర్, 2026 TIME : 12:39 PM

ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలో విద్యార్థుల భారీ ర్యాలీ కల్వకుంట్ల కవిత నిప్పులు

Main Image

ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హన్మకొండలో విద్యార్థుల భారీ ర్యాలీ.. కల్వకుంట్ల కవిత నిప్పులు

హన్మకొండ బ్యూరో / తెలంగాణ అడ్డా

విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హన్మకొండలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించిన అనంతరం, అక్కడి నుంచి హన్మకొండ కలెక్టరేట్ వరకు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థుల ఫీజు బకాయిలను చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి విధానాలపై విమర్శలు గుప్పిస్తూ.. ఒకసారి ఇంటర్మీడియట్ విద్యా విధానాన్నే తీసేస్తానని అంటారని, మరోసారి పాలిటెక్నిక్‌ను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తామని గందరగోళం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.

ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీలు, ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తి చేసినప్పటికీ కాలేజీల నుంచి సర్టిఫికెట్లు అందక ఉద్యోగాలు పొందలేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఈ ప్రభుత్వంపై ఫీజు బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Clip Adjustments