వెయ్యి రోజుల ప్రజా పాలనలో కాంగ్రెస్‌కే ప్రజల మద్దతు

వెయ్యి రోజుల ప్రజా పాలనలో కాంగ్రెస్‌కే ప్రజల మద్దతు
వెంకట్రావుపల్లిలో సర్పంచ్ సంధ్య మహేందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం
బోయిన్పల్లి మండలం / తెలంగాణ అడ్డా:
వెయ్యి రోజుల ప్రజా పాలనలో భాగంగా బోయిన్పల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో సోమవారం మహిళల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సంధ్య మహేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే మహిళలకు, పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయని మహిళలు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వారు అన్నారు.
రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి రావాలని మహిళలు ఆకాంక్ష వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కాంగ్రెస్‌కు ప్రజలు అండగా నిలవాలని వారు కోరారు.
ఈ సందర్భంగా గ్రామంలో కాంగ్రెస్ పాలనపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో స్థానిక మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.