Back to Home
Watermark
సోమవారం, 07 సెప్టెంబర్, 2026 TIME : 04:24 PM

విత్తన గణపతిని పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం

Main Image

విత్తన గణపతిని పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తీసుకొచ్చిన విత్తన గణపతి కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కరీంనగర్‌లో ఉద్యమ నాయకులు, బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నాయకులు జక్కుల నాగరాజుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు కమల్ గౌడ్ విత్తన గణపతిని అందజేశారు. పర్యావరణానికి హాని కలగకుండా వినాయక చవితి వేడుకలను నిర్వహించేందుకు విత్తన గణపతి ఎంతో ఉపయోగకరమని వారు పేర్కొన్నారు.

వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసిన అనంతరం అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదిగే విధంగా విత్తన గణపతిని రూపొందించడం అభినందనీయమని నాయకులు తెలిపారు. ప్రజలు కూడా విత్తన గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సముద్రాల ఓంకార్, నాగుల శ్రీనివాస్, తొంటి మధుకార్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments