Back to Home
Watermark
మంగళవారం, 08 సెప్టెంబర్, 2026 TIME : 06:17 PM

శాసనమండలి నుండి తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి సస్పెన్షన్.. సెషన్ మొత్తానికి అనర్హత ప్రకటించిన మండలి ఛైర్మన్

Main Image

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

శాసనమండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిలను సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ఇద్దరు ఎమ్మెల్సీలను వెంటనే సస్పెండ్ చేయాలని మహేష్‌కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

ఈ తీర్మానంపై మండలి ఛైర్మన్ మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ అనంతరం ఆ ఇద్దరు ఎమ్మెల్సీలను ప్రస్తుత సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు ఛైర్మన్ అధికారికంగా ప్రకటించారు. ఈ సస్పెన్షన్ ప్రకటన తర్వాత శాసనమండలి వాయిదా పడింది.

Clip Adjustments