Back to Home
Watermark
మంగళవారం, 08 సెప్టెంబర్, 2026 TIME : 06:23 PM

నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్తత పోలీసుల తీరుపై లాయర్ల ఆగ్రహం

Main Image

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

​నాంపల్లి కోర్టు ప్రాంగణంలో పోలీసులకు, న్యాయవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీలను కోర్టుకు తీసుకువచ్చిన సమయంలో నారాయణగూడ ఎస్సై వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.

​విధుల్లో భాగంగా అక్కడ ఉన్న మీడియా ప్రతినిధులను నాంపల్లి కోర్టును ఖాళీ చేసి వెంటనే వెళ్లిపోవాలని ఎస్సై హుకుం జారీ చేశారు. మీడియాపై ఎస్సై దురుసుగా ప్రవర్తించడంతోపాటు హేళనగా మాట్లాడటాన్ని అక్కడ ఉన్న లాయర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. మీడియా ప్రతినిధులకు మద్దతుగా లాయర్లు ఆందోళనకు దిగడంతో కోర్టు ప్రాంగణంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా కలకలం రేపాయి.

Clip Adjustments