తాతా మధు, నవీన్‌రెడ్డికి ఊరట రిమాండ్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు

హైదరాబాద్ / తెలంగాణ అడ్డా:
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డికి ఊరట లభించింది. వారిద్దరి రిమాండ్‌ను హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు తిరస్కరించింది.రూ. 10 వేల చొప్పున పూచికత్తుతో రెండు శ్యూరిటీలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. శ్యూరిటీలు సమర్పించిన తర్వాత ఎమ్మెల్సీలను విడుదల చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో శ్యూరిటీలు సమర్పించిన తాతా మధు, నవీన్ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. కాగా, తదుపరి విచారణను ఈ నెల 17కు న్యాయస్థానం వాయిదా వేసింది.