బొల్లారంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ విద్యార్థులు, తల్లిదండ్రులు, అవసరమైన వారికి ఉచిత వైద్య సేవలు

బొల్లారంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్
విద్యార్థులు, తల్లిదండ్రులు, అవసరమైన వారికి ఉచిత వైద్య సేవలు
బొల్లారం, సెప్టెంబర్ 9 (తెలంగాణ అడ్డా – జిన్నారం ప్రతినిధి):
ది మాస్టర్‌మైండ్స్ స్కూల్, ఐడీఏ బొల్లారం బ్రాంచ్ ఆధ్వర్యంలో శ్రీకర హాస్పిటల్స్ సహకారంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, అవసరమైన వారికి ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను విజయవంతంగా నిర్వహించారు.

ఈ ఆరోగ్య శిబిరం చైర్మన్ డా. సంగాని రాజు, డైరెక్టర్లు బుక్యా శివ నాయక్, సునీల్, ప్రిన్సిపాల్ & డైరెక్టర్ డా. మరోజు శ్వేత, ఆనంద్ కృష్ణారెడ్డి, మన్నె సతీష్, దేవీప్రసాద్ తదితరుల మార్గదర్శకత్వంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ విభాగాలకు చెందిన వైద్య నిపుణులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్యంపై తగిన సూచనలు అందించారు. డా. మృదుక – పీడియాట్రీషియన్, డా. శ్వేత – గైనకాలజిస్ట్, డా. సంధ్య – కార్డియాలజిస్ట్, డా. రమ్య – ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్, డా. రజనీకాంత్ – ఆర్‌ఎంఓ తమ విలువైన వైద్య సేవలను అందించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులతో పాటు అవసరమైన వారికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం పట్ల పలువురు అభినందించారు. ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు ముందస్తు వైద్య పరీక్షల ప్రాధాన్యతను తెలియజేయడం ద్వారా ఈ కార్యక్రమం ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని నిర్వాహకులు తెలిపారు.
సామాజిక బాధ్యతతో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించిన ది మాస్టర్‌మైండ్స్ స్కూల్, శ్రీకర హాస్పిటల్స్ యాజమాన్యాన్ని స్థానికులు అభినందించారు.