Back to Home
Watermark
బుధవారం, 09 సెప్టెంబర్, 2026 TIME : 07:49 PM

కాంగ్రెస్–బీఆర్ఎస్ దొంగనాటకాల వల్లే ప్రజా సమస్యలు గాలికొదిలేశారు: జనసేన నేత డా. బండారి రాజ్ కుమార్

Main Image

కాంగ్రెస్–బీఆర్ఎస్ దొంగనాటకాల వల్లే ప్రజా సమస్యలు గాలికొదిలేశారు: జనసేన నేత డా. బండారి రాజ్ కుమార్

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

కాంగ్రెస్–బీఆర్ఎస్ రాజకీయ దొంగనాటకాలకు ప్రజల సమస్యలు బలవుతున్నాయని జనసేన నేత డా. బండారి రాజ్ కుమార్ మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు జనసేన ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరగా పోలీసులు నాయకులను అడ్డుకుని అరెస్ట్ చేశారు.

ప్రజల సమస్యలపై ప్రశ్నించడం నేరమా అని, కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి కూడా అవకాశం ఇవ్వరా అని డా. బండారి రాజ్ కుమార్ ప్రశ్నించారు. అరెస్టులతో జనసేన గొంతును నొక్కలేరని, ప్రజల కోసం తమ పోరాటం మరింత ఉధృతమవుతుందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో రాజకీయ డ్రామాలు పక్కనపెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, లేదంటే ప్రజల పక్షాన జనసేన పార్టీ రోడ్డెక్కి పోరాడుతుందని హెచ్చరించారు.

ఈ ఆందోళనలో డా. బండారి రాజ్ కుమార్‌తో పాటు జనసేన పార్టీ సీనియర్ నాయకులు వొడ్నాల రాజు, అంబాల సృజన్ కుమార్, జనార్ధన్, నమిత బాద్, నాగిశెట్టి రంజిత్ కుమార్, తేలుకుంట్ల శ్రీనివాస్, బర్ల అన్వేష్, ఉప్పులేటి శ్రీకాంత్, తేలికుంట్ల రాజు, పవర్ బాలు, నర్సింగ్ ఓజు శ్రీనివాస్, తగరపు శ్రీనివాస్, కొండ సంతోష్ తదితరులు అరెస్టయ్యారు.

Clip Adjustments