కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్

కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల అభ్యర్థుల వయోపరిమితి పెంచాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరిన ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్
హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితిని పెంచాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూర్ వెంకట్ కోరారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కలిసి ఈ మేరకు ఆయన వినతిపత్రం అందజేశారు.
కరోనా పరిస్థితుల నేపథ్యం మరియు నోటిఫికేషన్లు ఆలస్యం కావడం వల్ల చాలా మంది నిరుద్యోగులు వయోపరిమితి మించిపోయి అర్హత కోల్పోతున్నారని సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 36 ఏళ్లకు, ఎస్సై ఉద్యోగానికి 37 ఏళ్ల నుంచి 38 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగుల అభ్యర్థనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, అన్ని అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ తెలిపారు.