పత్తి పంట సమగ్ర సస్యరక్షణ సాంకేతికతపై రైతులకు అవగాహన

పత్తి పంట సమగ్ర సస్యరక్షణ సాంకేతికతపై రైతులకు అవగాహన
తెలంగాణ అడ్డా న్యూస్, (భద్రాద్రి జిల్లా ప్రతినిధి).
మణుగూరు మండలం అన్నారం గ్రామం లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో "ఆత్మ" కార్యక్రమం ద్వారా రైతు కముజు చంద్ర మోహన్ పత్తి పంటలో సమగ్ర సస్యరక్షణ (ఐ పి ఎం) సాంకేతికతపై ప్రదర్శన ( డెమో) నిర్వహించినట్లు మణుగూరు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారి డాక్టర్ కొమరం లక్ష్మణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పత్తి పంటలో చీడపీడల నియంత్రణకు రసాయనిక పురుగుమందుల వినియోగాన్ని తగ్గిస్తూ, ఫెరోమోన్ ట్రాప్స్, స్టిక్కీ ట్రాప్స్, స్టెమ్ అప్లికేషన్, వేపనూనె తదితర ఐ పి ఎం పద్ధతులను ఉపయోగించే విధానాన్ని క్షేత్రస్థాయిలో ప్రదర్శించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. అలాగే రైతులకు అవసరమైన ఐ పి ఎం ఇన్‌పుట్స్‌ను కూడా అందజేశారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులు సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి పత్తి పంటలో చీడపీడలను సమర్థ వంతంగా నియంత్రించు కోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు బి.తాత రావు, ఆత్మ కమిటీ చైర్మన్ ఆవుల సర్వేశ్వరరావు, వ్యవసాయ అధికారి వి. రాహుల్ రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి డా. కొమరం లక్ష్మణ్ రావు పాల్గొని రైతులకు పత్తిలో సమగ్ర సస్యరక్షణ పద్ధతులపై సూచనలు అందించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్ కుర్రి చలపతి రావు, రైతులు బత్తుల శ్రీను, జాను తదితరులు పాల్గొన్నారు.