కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం

కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం
కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్‌లోని రికార్డులు, రిసెప్షన్ కౌంటర్, పౌరుల స్పందన (సిటిజన్ ఫీడ్‌బ్యాక్) వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
పోలీస్ స్టేషన్‌లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పరిశీలించిన సీపీ, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్), ఈ-సాక్ష్య, సమన్వయ వంటి సాంకేతిక పోర్టల్స్, అప్లికేషన్ల పనితీరును సమీక్షించారు. నేర పరిశోధన, రోజువారీ పోలీసింగ్‌లో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.
అలాగే, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ప్రజలకు సత్వర న్యాయం అందేలా చూడాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీలో ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, సబ్ ఇన్‌స్పెక్టర్ సాంబమూర్తితో పాటు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.