Back to Home
Watermark
బుధవారం, 09 సెప్టెంబర్, 2026 TIME : 11:02 PM

కానిస్టేబుల్, సమాన హోదా పోస్టుల వయోపరిమితి మరో 3 సంవత్సరాలు పెంపు జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Main Image

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

పోలీస్, ఫైర్ సర్వీసెస్, ప్రిజన్స్ మరియు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లోని కానిస్టేబుల్ మరియు తత్సమాన పోస్టుల ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి గరిష్ఠ వయోపరిమితిని మరో 3 సంవత్సరాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ (సర్వీసెస్-ఎ) శాఖ ఈ మేరకు జీ.ఓ.ఎంఎస్.నెం.129ని సెప్టెంబర్ 9, 2026 న విడుదల చేసింది.

గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏడు (7) సంవత్సరాలు పెంచిన వయోపరిమితికి అదనంగా, ప్రస్తుతం మరో మూడు (3) సంవత్సరాలు పెంచుతున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాలు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ద్వారా జరిగే నియామకాలకు ఈ అడ్-హాక్ నిబంధన వర్తించనుంది. అయితే పోలీస్ శాఖలోని పీసీ డ్రైవర్ పోస్టులకు ఇది వర్తించదని స్పష్టం చేశారు. సబ్‌ఇన్‌స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ పోస్టుల వయోపరిమితుల్లో ఉన్న వ్యత్యాసాన్ని సరిచేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు.

Clip Adjustments