Back to Home
Watermark
గురువారం, 10 సెప్టెంబర్, 2026 TIME : 05:20 PM

పార్క్ ప్రారంభ సమయాన్ని సాయంత్రం 4 గంటలకు మార్చాలి

Main Image

పార్క్ ప్రారంభ సమయాన్ని సాయంత్రం 4 గంటలకు మార్చాలి

వేములవాడ, సెప్టెంబర్ 10 (తెలంగాణ అడ్డా):

వేములవాడ మున్సిపల్ పరిధిలోని పార్కును సాయంత్రం 5 గంటలకు కాకుండా 4 గంటలకే తెరవాలని పట్టణవాసులు కోరుతున్నారు. ప్రస్తుతం పార్కు ప్రారంభ సమయం ఆలస్యంగా ఉండటంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు మరియు సాయంత్రం వేళల్లో వాకింగ్‌కు వచ్చే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు పేర్కొంటున్నారు.

Additional Image

సాయంత్రం 4 గంటల నుంచే పార్కును అందుబాటులోకి తీసుకువస్తే ప్రజలకు మరింత ప్రయోజనం కలుగుతుందని పట్టణవాసులు తెలిపారు. ముఖ్యంగా పాఠశాలలు, కార్యాలయాల నుంచి త్వరగా వచ్చే వారికి పార్కును వినియోగించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పార్కు ప్రారంభ సమయాన్ని గంట ముందుకు మార్చాలని మున్సిపల్ అధికారులను పట్టణవాసులు కోరుతున్నారు.

Clip Adjustments