Back to Home
Watermark
గురువారం, 10 సెప్టెంబర్, 2026 TIME : 08:02 PM

చాకలి ఐలమ్మ వర్ధంతి.. కరీంనగర్‌లో ఘన నివాళులు

Main Image

చాకలి ఐలమ్మ వర్ధంతి.. కరీంనగర్‌లో ఘన నివాళులు

కరీంనగర్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లోని ఆమె విగ్రహానికి మేయర్ కొలగాని శ్రీనివాస్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ సామాజిక అసమానతలు, దోపిడీ, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని అన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన ధైర్యం, తెగువ, ఆత్మవిశ్వాసం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

చాకలి ఐలమ్మ కేవలం ఒక వ్యక్తి కాదని, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక అని మేయర్ అన్నారు. ఆమె ఆశయాలు, పోరాట స్ఫూర్తిని నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, గౌరవం కల్పించడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని తెలిపారు.

తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో చాకలి ఐలమ్మ పాత్ర ఎంతో కీలకమైనదని, ఆమె ధైర్యసాహసాలు, త్యాగాలు తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, ఎన్నం ప్రకాష్, గాజ శివరాం, దేవసాని సత్యనారాయణ, మునిగంటి కుమార్, పొన్నాల రాము, ఉప్పరపల్లి శ్రీను, గుండారపు సంపత్, అవునూరి భరత్, వెంకట సాయి, న్యాత ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments