Back to Home
Watermark
గురువారం, 10 సెప్టెంబర్, 2026 TIME : 08:09 PM

ఉపసర్పంచ్‌ల ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తిక్కల నవీన్

Main Image

ఉపసర్పంచ్‌ల ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తిక్కల నవీన్

ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారమే లక్ష్యం

బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తా.. రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు

కోనరావుపేట, సెప్టెంబర్ 10 (తెలంగాణ అడ్డా):

రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరమ్ ప్రధాన కార్యదర్శిగా బావుసాయిపేట గ్రామ ఉపసర్పంచ్ తిక్కల నవీన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఫోరమ్ నాయకులు, ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరమ్ ప్రధాన కార్యదర్శిగా తిక్కల నవీన్‌ను నియమిస్తూ ఫోరమ్ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. బావుసాయిపేట గ్రామ ఉపసర్పంచ్‌గా కొనసాగుతున్న నవీన్‌కు జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించడంపై పలువురు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా తిక్కల నవీన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన ఉపసర్పంచ్‌ల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు లక్కీ రెడ్డి, కోనరావుపేట మండల అధ్యక్షులు రాజుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జిల్లా వ్యాప్తంగా ఉపసర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఉపసర్పంచ్‌ల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఫోరమ్‌ను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు.

తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఉపసర్పంచ్‌లకు అండగా నిలుస్తానని తిక్కల నవీన్ పేర్కొన్నారు.

Clip Adjustments