Back to Home
Watermark
గురువారం, 10 సెప్టెంబర్, 2026 TIME : 08:16 PM

గణేష్ ఉత్సవాలపై పోలీసుల కీలక సూచనలు డీజేలకు పూర్తి నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Main Image

గణేష్ ఉత్సవాలపై పోలీసుల కీలక సూచనలు

డీజేలకు పూర్తి నిషేధం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కమలాపూర్, సెప్టెంబర్ 10 (తెలంగాణ అడ్డా):

గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పలు కీలక సూచనలు, నిబంధనలను వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నందున మండప నిర్వాహకులు తప్పనిసరిగా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

డీజేలపై పూర్తి నిషేధం

గణేష్ విగ్రహాల ఆగమన, నిమజ్జన కార్యక్రమాల సమయంలో డీజేలకు పూర్తిగా నిషేధం విధించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా డీజేలు ఏర్పాటు చేస్తే సంబంధిత నిర్వాహకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

శాంతిభద్రతలకు సహకరించాలి

భక్తులు గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించాలని పోలీసులు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకోకుండా పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

మండపాల్లో పేకాటకు నో

గణేష్ మండపాల వద్ద పేకాటతో పాటు ఎలాంటి నిషేధిత ఆటలు నిర్వహించరాదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సమావేశంలో కమలాపూర్ సీఐ నవీన్ యాదవ్, ఎస్సైలు దిలీప్, మధుతో పాటు పోలీస్ సిబ్బంది, గణేష్ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments