Back to Home
Watermark
శుక్రవారం, 11 సెప్టెంబర్, 2026 TIME : 04:04 PM

ప్రమాదకరంగా మారిన నాలుగు కూడళ్ల రహదారి స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి

Main Image

ప్రమాదకరంగా మారిన నాలుగు కూడళ్ల రహదారి

స్పీడ్ బ్రేకర్లు, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి

సిపిఎం పార్టీ డిమాండ్

బోయినిపల్లి, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం దేశాయిపల్లి మెయిన్ రహదారిపై ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. బోయినిపల్లి నుంచి కొదురుపాక వెళ్లే ప్రధాన రహదారిపై ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, అయితే రహదారిపై సరైన ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు.

నాలుగు కూడళ్ల వద్ద వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సిపిఎం నాయకులు కోరారు. రహదారి పరిస్థితిపై జిల్లా రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, కురుమ సంజీవ్, బూరుగు రమేష్, బూరుగు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments