Back to Home
Watermark
శుక్రవారం, 11 సెప్టెంబర్, 2026 TIME : 08:07 PM

ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి రైతులకు అవగాహన కల్పించిన ఏఈఓలు స్రవంతి, రజిత

Main Image

ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి

రైతులకు అవగాహన కల్పించిన ఏఈఓలు స్రవంతి, రజిత

టేక్మల్, సెప్టెంబర్ 11 (తెలంగాణ అడ్డా):

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు రైతులకు అందాలంటే ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏఈఓలు స్రవంతి, రజిత సూచించారు.

టేక్మల్ మండలంలోని ఎలకుర్తి క్లస్టర్‌లో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈఓలు మాట్లాడుతూ, రైతులు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఎంతో అవసరమన్నారు. అలాగే ఆన్‌లైన్ ద్వారా ఎరువులు పొందాలన్నా రైతుల రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.

రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, ఫోన్ నంబర్ వివరాలతో తమ క్లస్టర్ పరిధిలోని ఏఈఓలను సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రైతులు ఎలాంటి ఆలస్యం చేయకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.

Clip Adjustments