Back to Home
Watermark
శుక్రవారం, 11 సెప్టెంబర్, 2026 TIME : 10:09 PM

భావుసింగ్ నాయక్ తండాలో భూమి పూజ చేసిన సర్పంచ్ గూగులోత్ రమేష్ నాయక్

Main Image

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం

భావుసింగ్ నాయక్ తండాలో భూమి పూజ చేసిన సర్పంచ్ గూగులోత్ రమేష్ నాయక్

అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి న్యాయం చేస్తాం

తెలంగాణ అడ్డా, వీర్నపల్లి, సెప్టెంబర్ 11:

వీర్నపల్లి మండల పరిధిలోని భావుసింగ్ నాయక్ తండాలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. గ్రామ సర్పంచ్ గూగులోత్ రమేష్ నాయక్ లబ్ధిదారులతో కలిసి భూమి పూజ నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ప్రయోజనకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

లబ్ధిదారులు ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు. నిర్మాణ పనుల సమయంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామ పంచాయతీ సిబ్బంది పర్యవేక్షణ కొనసాగిస్తారని తెలిపారు.

కార్యక్రమంలో ఉపసర్పంచ్ గూగులోత్ హరిదాష్ నాయక్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి నీతా, లబ్ధిదారులు బానోతు లలిత, గ్రామస్తులు బానోతు లింభాద్రి, అరవింద్, సరియ, అజ్మీరా ప్రమేశ్, బానోతు రాజు, శ్రీనివాస్, కిస్టు, లాచిరాం, భుక్య లింగం, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Clip Adjustments