Back to Home
Watermark
శనివారం, 12 సెప్టెంబర్, 2026 TIME : 04:25 PM

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు

Main Image

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు

చెరువులో వ్యర్థాల తొలగింపు పనులను పరిశీలించిన చైర్మన్

నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన

తెలంగాణ అడ్డా ప్రతినిధి వేములవాడ

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రానున్న వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నారు.

ఈ క్రమంలో చెరువులో గత కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్తాచెదారం, వ్యర్థాలను క్రేన్ సహాయంతో తొలగిస్తున్న పనులను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పరిశీలించారు. వినాయక విగ్రహాలు సులభంగా, పూర్తిగా నిమజ్జనం అయ్యేలా చెరువును శుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.

నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని, కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని చైర్మన్ పుల్కం రాజు సూచించారు.

Clip Adjustments