Back to Home
Watermark
శనివారం, 12 సెప్టెంబర్, 2026 TIME : 05:02 PM

అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఆర్థిక సహాయం అందించాలి హుజూరాబాద్‌లో తెలంగాణ రక్షణ సేన నాయకుల నిరాహార దీక్ష

Main Image

హుజూరాబాద్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

అర్హులైన దళిత కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దళిత బంధు క్రింద ఆర్థిక సహాయం చెయ్యాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన జిల్లా నాయకులు బండ అశోక్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్సందర్శించి మాట్లాడారు. దళిత బంధు పథకం రెండో విడత నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో స్పష్టంచేయాలని,హుజురాబాద్నియోజకవర్గంలో మొదటి విడతలో లబ్ధి పొందని అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ. 12 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందని ప్రశ్నించారు. దళిత కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక దాన్ని విస్మరించి నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా నిరసన దీక్ష చేపట్టిన హుజూరాబాద్ నియోజకవర్గ నాయకులను ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్నియోజకవర్గం నాయకులు బుర్ర నటరాజ్, సురేష్, సంతోష్ యాదవ్, దీటి శిరీష రమేష్, జిల్లా నాయకులు ఎం.డి. సల్మా, జంగ అపర్ణ, దసరి అంజలి, గౌతమి, రంగరవేణి లక్ష్మణ్, శ్రీరాముల రమేష్, కుతాడి శ్రీనివాస్, బసవేణి రాజేందర్, అంబాల హరిష్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments