Back to Home
Watermark
శనివారం, 12 సెప్టెంబర్, 2026 TIME : 05:31 PM

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో చేపడుతున్న విత్తన గణపతి కార్యక్రమానికి విశేష స్పందన

Main Image

విత్తన గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

తెలంగాణ అడ్డా ప్రతినిధి:

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో చేపడుతున్న విత్తన గణపతి కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణహితమైన విత్తన గణపతి ప్రతిమలను పంపిణీ చేస్తున్నారు.

ఈ క్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సభ్యులు కమల్ గౌడ్, ప్రతిమ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్‌కు ఆయన హాస్పిటల్‌లో విత్తన గణపతి ప్రతిమను అందజేశారు.

వినాయక చవితి అనంతరం విత్తన గణపతి ప్రతిమను నిమజ్జనం చేసిన తర్వాత అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరిగేలా ఈ ప్రతిమలను రూపొందించినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా విత్తన గణపతులను ప్రోత్సహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సముద్రాల ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.

Clip Adjustments