రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో కోట్లాది రూపాయల మోసం ఇద్దరు నిందితుల అరెస్ట్

ఆదిలాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:
రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయని అమాయక ప్రజలను నమ్మించి, కోట్లాది రూపాయలు వసూలు చేసిన మోసపూరిత ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు ఇప్పటివరకు 16 మంది నుంచి సుమారు రూ. 13.31 కోట్ల వరకు అక్రమంగా సేకరించినట్లు విచారణలో తేలింది. ఈ మోసానికి సంబంధించిన బ్యాంకు లావాదేవీలపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ఈ కేసుకు సంబంధించి నిందితుల వద్ద నుంచి ఒక ఫార్చునర్, ఒక థార్ వాహనంతో పాటు పలు ఖరీదైన ప్లాట్లు, స్థలాలకు సంబంధించిన విలువైన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నిందితుల వివరాలు:A-1: బండారి రాకేష్ (వయస్సు 30 సంవత్సరాలు)A-2: కుంటవార్ అచ్యుత్ రెడ్డి (వయస్సు 53 సంవత్సరాలు)A-3: కుంటవార్ చంద్రకాంత్ రెడ్డి (ప్రస్తుతం పరారీలో ఉన్నారు)ప్రజలు ఎవరూ కూడా తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయంటూ ఆశ చూపే మోసపూరిత వ్యక్తులను నమ్మి భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి మోసపోవద్దని హెచ్చరించారు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత వ్యక్తులు, సంస్థలు, ఆస్తులు మరియు వారి లావాదేవీల వివరాలను పూర్తిగా పరిశీలించుకోవాలని సూచించారు.ఒకవేళ ఎవరికైనా అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఎదురైనా, లేదా మోసం జరిగినట్లు గుర్తించినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.