కురుమ సంఘం అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సువీన్ యాదవ్ సొంత ఖర్చులతో కెమెరా ఏర్పాటు చేయించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు

ఆలయ భద్రతకు సీసీ కెమెరా ఏర్పాటు
కురుమ సంఘం అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన సువీన్ యాదవ్
సొంత ఖర్చులతో కెమెరా ఏర్పాటు చేయించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు
ఆలయ పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలకు చెక్
కురుమ సంఘం పాలకవర్గం కృతజ్ఞతలు
తెలంగాణ అడ్డా, బోయినపల్లి: బోయినిపల్లి మండల కేంద్రంలోని బీరప్ప స్వామి ఆలయ భద్రత కోసం సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని నూతనంగా ఏర్పాటైన కురుమ సంఘం పాలకవర్గం చేసిన అభ్యర్థనకు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. కురుమ సంఘం పెద్దలు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి, ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేయించారు.
గతంలో బీరప్ప స్వామి ఆలయంలో గంటల దొంగతనాలు జరగడంతో పాటు ఆలయ పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకున్నట్లు కురుమ సంఘం పెద్దలు తెలిపారు. దీంతో ఆలయానికి భద్రత కల్పించేందుకు సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని కోరగా, సువీన్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకుని సొంత ఖర్చులతో కెమెరా ఏర్పాటు చేయించడం పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
సీసీ కెమెరా ఏర్పాటుతో ఆలయానికి వచ్చే భక్తులకు భద్రత కల్పించడంతో పాటు ఆలయ పరిసరాల్లో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు అవకాశం ఉంటుందని కురుమ సంఘం పాలకవర్గం పేర్కొంది. ఆలయ భద్రత కోసం వెంటనే స్పందించి సహకరించిన సువీన్ యాదవ్‌కు కురుమ సంఘం పాలకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుంటి మహిపాల్, జలేందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు