Back to Home
Watermark
ఆదివారం, 13 సెప్టెంబర్, 2026 TIME : 09:17 PM

రామగుండం కమిషనరేట్ పరిధిలో జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 5,261 కేసులు పరిష్కారం సీపీ అంబర్ కిషోర్ ఝా

Main Image

ఝారామగుండం ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2026 సెప్టెంబర్ 12న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతమైందని, వివిధ విభాగాల్లో మొత్తం 5,261 కేసులు పరిష్కరించబడినట్లు పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై దర్యాప్తులో ఉన్న, అలాగే న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న రాజీకి వీలైన కేసుల్లో 613 భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కేసులు, ప్రత్యేక చట్టాలకు సంబంధించిన36కసులుపరిష్కారమయ్యాయి. వీటితో పాటు 2,872 ఈ-చలాన్ కేసులు, మద్యం సేవించి వాహనం నడిపిన 1,740 కేసులు కలిపి మొత్తం 5,261 కేసులు పరిష్కారం అయినట్లు వెల్లడించారు.

125 సైబర్ నేర కేసుల్లో బాధితులకు రూ. 33,65,739/- అందజేత సైబర్ మోసాలకు గురైన బాధితులను ఆదుకునే క్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన 123 సైబర్ నేర కేసులకు సంబంధించి రూ. 27,58,843/- బాధితులకు తిరిగి అందజేయబడింది. అలాగే సీసీపీఎస్ పోలీస్ స్టేషన్, రామగుండంలో నమోదైన 2 సైబర్ నేర కేసుల్లో బాధితులకు రూ. 6,06,896/- చొప్పున మొత్తం 125 కేసుల్లో రూ. 33,65,739/- రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు సీపీ తెలిపారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా పెట్టీ కేసులు, ట్రాఫిక్, ఎక్సైజ్, మద్యం సేవించి వాహనం నడిపిన కేసులు తదితర స్వల్ప నేరాలకు సంబంధించిన కేసులు వేగంగా పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారం ద్వారా ప్రజలకు సమయం, ధనం ఆదా అయ్యాయని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమన్నారు. గత 15 రోజులుగా పోలీస్ అధికారులు, న్యాయస్థాన సిబ్బంది పక్షాలను స్వయంగా కలిసి రాజీ మార్గమే ఉత్తమమని అవగాహన కల్పించడం వల్లే నిర్దేశిత లక్ష్యానికి మించి కేసులు పరిష్కారమయ్యాయని తెలిపారు.

రోజూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు న్యాయస్థాన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ, అధికారుల సమన్వయంతో ఈ విజయం సాధించిన సిబ్బందిని సీపీ అభినందించారు. ప్రతిరోజూ కేసుల పరిష్కారాన్ని పర్యవేక్షించిన అధికారులకు, కృషి చేసిన సిబ్బందికి త్వరలో పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన రెండు జోన్ల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవా సంస్థలకు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Clip Adjustments