Back to Home
Watermark
సోమవారం, 14 సెప్టెంబర్, 2026 TIME : 09:53 AM

జహీరాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా వంగేటి ప్రతాపరెడ్డి

Main Image

జహీరాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా వంగేటి ప్రతాపరెడ్డి

జిన్నారం తెలంగాణ అడ్డా, సెప్టెంబర్ 13: భారతీయ జనతా పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించారు. ఇందులో భాగంగా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా జిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ వంగేటి ప్రతాపరెడ్డిని నియమించారు.

పార్టీలో గత 25 సంవత్సరాలుగా విశ్వాసంతో పనిచేస్తూ, పార్టీ కార్యక్రమాలకు సమయం కేటాయించిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని తనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు ప్రతాపరెడ్డి తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.

తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డికి, ఎంపీ రఘునందన్‌రావుకు, ఎమ్మెల్సీ అంజిరెడ్డికి ప్రతాపరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Clip Adjustments