కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
వినాయక చవితి రోజున విచారణకు హాజరు కావాలని ఆదేశం
హైదరాబాద్ తెలంగాణ అడ్డా ప్రతినిధి సెప్టెంబర్ 14: అసెంబ్లీ మూడో గేట్ వద్ద ఈ నెల 7న జరిగిన ఘటనలకు సంబంధించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్వో మహేశ్‌కు సైఫాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం వినాయక చవితి రోజున ఉదయం 10 గంటలకు సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ కేసులో నిందితులుగా ఉన్న మహేందర్‌రెడ్డి, మహేశ్ హైకోర్టును ఆశ్రయించగా, వారికి మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ దర్యాప్తునకు సహకరించాలని కోర్టు సూచించినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి.
అయితే పండుగ రోజునే విచారణకు పిలవడంపై బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వం కక్షపూరిత ధోరణికి నిదర్శనమని వారు ఆరోపించారు. మరోవైపు, కేసు దర్యాప్తులో భాగంగానే పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సోమవారం మహేందర్‌రెడ్డి, మహేశ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ అడ్డా ప్రతినిధి