కరీంనగర్‌లో వినాయక మండపాల జోరు.. రామనగర్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్, ప్రజల ఇబ్బందులు

కరీంనగర్ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:

కరీంనగర్‌లోని రామనగర్ నుంచి టెలిఫోన్ క్వార్టర్స్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై 'పెద్ద పోల్' ప్రాంతంలో వినాయక చవితి వేడుకల రాజకీయ వాతావరణం నెలకొంది. ఇక్కడ రెండు భారీ వినాయక మండపాలను పక్కపక్కనే ఏర్పాటు చేయడం, పోటీపోటీగా ఏర్పాట్లు చేయడంతో ఈ ప్రాంతం ప్రధాన ఆకర్షణగా మారింది.ఈ రెండు ప్రతిష్టాత్మక వినాయక ప్రతిమలను కనులారా వీక్షించడానికి కరీంనగర్ నగర నలుమూలల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆ మార్గంలో తీవ్రమైన జనసమర్ధం ఏర్పడి రోడ్డు పూర్తిగా బ్లాక్ అవుతోంది. వాహనాలు ముందుకు కదలక పోవడంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రయాణికులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ జనసమూహం, వాహనాల రాకపోకలతో రోడ్డంతా అస్తవ్యస్తంగా మారడంతో ట్రాఫిక్ను నియంత్రించడానికి పోలీసులకు సైతం తీవ్ర శ్రమ కలుగుతోంది. పండగ ఉత్సాహం ఒకవైపు ఉన్నప్పటికీ, ప్రధాన రహదారిపై ఏర్పడుతున్న ఈ తీవ్ర ట్రాఫిక్ జామ్ వల్ల అత్యవసర రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ప్రజలు వాపోతున్నారు.