Back to Home
Watermark
మంగళవారం, 15 సెప్టెంబర్, 2026 TIME : 04:32 PM

తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి ఆగా ఖాన్ ఫౌండేషన్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి

Main Image

హైదరాబాద్ బ్యూరో / తెలంగాణ అడ్డా:

తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా మరింత సహకారం అందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పని చేయాలని ఆయన కోరారు. భారత పర్యటనలో ఉన్న ఆగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ హిజ్ హైనెస్ ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-V హైదరాబాద్‌ విచ్చేసిన సందర్భంగా తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి ఆయనతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.ఈ సమావేశంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ ద్వారా తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గుర్తుచేస్తూ, ఫౌండేషన్‌పై తమకు అత్యంత గౌరవం ఉందని తెలిపారు. హైదరాబాద్‌తో ఆగా ఖాన్ గారి కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా నెమరువేసుకున్నారు. తెలంగాణ వారసత్వ సంపదను పునరుద్ధరించడంలో ఫౌండేషన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని, ఫౌండేషన్ సహకారంతో ఇటీవల శాసనమండలి భవనాన్ని, నగరంలోని కుతుబ్ షాహీ టూంబ్స్‌ను పునరుద్ధరించిన విషయాన్ని ప్రస్తావించారు.మూసీ పునరుజ్జీవనం - చారిత్రక భవనాల పునరుద్ధరణ:హైదరాబాద్ నగర పునర్నిర్మాణంలో భాగంగా మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై సిద్ధం చేసిన ప్రణాళికలను సీఎం వివరించారు. మూసీ నది వెంట నైట్ ఎకానమీ కార్యకలాపాల దిశగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ క్రమంలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న చారిత్రక సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో సహకరించాలని కోరారు. ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, ప్రస్తుత ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ సంపదగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు చెప్పారు.ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక దృష్టి:డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించబోయే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ సమ్మిట్‌కు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై ఆసక్తి కనబరిచిన ప్రిన్స్ ఆగా ఖాన్-V దాని ప్రాధాన్యతను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా 30 వేల ఎకరాల్లో అత్యాధునిక సదుపాయాలతో అంతర్జాతీయ విమానాశ్రయానికి 20 నిమిషాల దూరంలో ఫ్యూచర్ సిటీని పూర్తిగా నెట్-జీరో సిటీగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. సింగపూర్‌ కంపెనీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో సుమారు 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నామని, అమెజాన్‌ వంటి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయని పేర్కొన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు.విద్యా, పర్యాటక రంగాల్లో

Additional Image

ఇటీవల బ్రిటన్, అమెరికా పర్యటనల్లో వివిధ ప్రపంచస్థాయి యూనివర్సిటీలతో తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల గురించి సీఎం సలహాదారు కె. రామకృష్ణా రావు వివరించారు. హార్వర్డ్ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌తో పాటు ఇతర యూనివర్సిటీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి అంగీకరించాయని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా కోరగా, పర్యాటక రంగంలో ఆగా ఖాన్ ఫౌండేషన్ పాత్రను స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణీ ప్రసాద్ గుర్తుచేస్తూ భవిష్యత్తులో మరింత సహకారం అందించాలని అభ్యర్థించారు.

ఈ సమావేశంలో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు ఉన్నతాధికారులు, ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Clip Adjustments