‘గోపు’ ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు.పాల్గొన్న ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి

ఎల్ఎండీ కాలనీ ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)లో మంగళవారం గణనాథునికి పోరండ్ల ప్యాక్స్ చైర్మన్ గోపు మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై పూజలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతోనిర్వహించుకోవాలని ప్రజలకు, పార్టీ శ్రేణులకు సూచించారు. నిష్ఠ, నియమాలతో గణనాథుడిని ఆరాధించాలని, ప్రజాజీవితంలో ఉన్న నాయకులు సామాజిక సేవా కార్యక్రమాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేసి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, నుస్తులాపూర్ ప్యాక్స్ చైర్మన్ మోరపల్లి రమణారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ చెన్నబోయిన రవి, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, శ్రీగిరి రంగారావు, పొన్నాల సంపత్, గంకిడి లక్ష్మారెడ్డి, చింతల లక్ష్మారెడ్డి, పొట్ట శ్రీనివాస్, గుంటి మల్లేశం, డాక్టర్ లక్ష్మణ్, పోలు రమేశ్, రాము, రెడ్డి రాజు, పోతుగంటి శ్రీనివాస్, ఐతం వెంకన్న, మహేష్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, నందగిరి రవీంద్రచారి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, రేవెల్లి రాజలింగం, రేమిడి శ్రీనివాస్ రెడ్డి, చెప్యాల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.