కొనరావుపేటకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు మండల నాయకుల కృతజ్ఞతలు

కొనరావుపేట ప్రతినిధి / తెలంగాణ అడ్డా:
వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కొనరావుపేట మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేయడం పట్ల మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రాధాన్యం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ఆధునిక విద్యా సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను అభివృద్ధి చేస్తోందని నాయకులు తెలిపారు.

కొనరావుపేటకు ప్రతిష్టాత్మక పాఠశాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని కొనరావుపేట మండల కేంద్రానికి మంజూరు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యార్థులకు ఆధునిక సౌకర్యాలు తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో మండలంలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన విద్యా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని నాయకులు పేర్కొన్నారు. కొనరావుపేట మండలానికి ఈ పాఠశాల మంజూరు కావడానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాఠశాల ఏర్పాటుతో మండల విద్యారంగంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.