బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే సత్యం పరామర్శ ఆర్థిక సహాయం అందజేత

బోయినపల్లి / తెలంగాణ అడ్డా:
చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మంగళవారం బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో పర్యటించారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తాళ్లపల్లి లత కుటుంబాన్ని, అలాగే పుట్టుకతో అంగవైకల్యంతో ఉన్న నలిమెల మహేందర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే సత్యం, కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ మరియు ప్రభుత్వం తరఫున వారికి పూర్తి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం బాధిత కుటుంబాలకు మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను అందజేసి, భవిష్యత్తులో ప్రభుత్వ పరంగా ఎలాంటి అవసరమున్నా మరింత సహాయం అందజేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ పర్యటనలో బోయినపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మనబోయిన సువీన్ యాదవ్, ఏఎంసీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, సెస్ డైరెక్టర్ కోటిపల్లి సుధాకర్, సర్పంచ్ నల్ల మోహన్, నాయకులు రమణారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ సతీష్, రమేష్, నగేష్, ఎమిరెడ్డి సురేందర్ రెడ్డి, సాంబ లచ్చయ్య, ముచ్చ శేఖర్ రెడ్డి, చంద్రయ్య, గంగయ్య, ప్రవీణ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.